Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
సమాజాన్ని సినిమా విస్మరించకూడదు. చలనచిత్రానికి ప్రభావితం కాని వారు ఎవ్వరూ లేరు. సమాంతర చిత్రాలు నిర్మించిన సత్యజిత్ రే, మృణాళ్ సేన్, నర్సింగరావు, టి. కృష్ణ, గౌతమ్ ఘోష్, కే. బీ. తిలక్ వంటి వారు స్మరణీయులు. సినిమానే లోకంగా బ్రతికే వారున్నారు. నిజాయితీతో సమీక్షలు రాసిన ’గుడిపూడి శ్రీహరి’ వంటి వారే నేటికి నాకు ప్రేరణ. ఆ మార్గమే ఈ ’సినిమా కోసం... గుప్పెడు ఊసులు’ పుస్తకంలో కనిపించాలని నా తపన.కమర్షియల్ విలువలు ఉన్న సృజనాత్మక చిత్రాలు ఎన్నో, ఎన్నెన్నో వచ్చాయి. సందేశాత్మక చిత్రాలు ఈ ’శత’వత్సర ’చిత్ర’ ప్రయాణంలో విడుదలయ్యాయి. పాత, క్రొత్త లను ఓ సారి సమీక్షించుకుంటే భవిష్యత్ పట్ల బాధ్యత పెరుగుతుందనేది నా భావన. - భమిడిపాటి గౌరీశంకర్