Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
తెలుగు సినిమాకు కథనశాస్త్రం లేదని కాదు. కానీ కథను కథనంగా ఎలా మలచాలి, దర్శకత్వ శిల్పం ఏమిటి, కథకూ కథనానికీ తేడా ఏమిటి వంటి అంశాలను సమగ్రంగా వివరించే ప్రామాణిక గ్రంథాలు ఇంకా రావాల్సిన అవసరం ఉంది.సినిమా జ్ఞానం వ్యక్తుల అనుభవానికే పరిమితం కాకుండా, అధ్యయనం చేయగలిగే, బోధించగలిగే, పరిశోధించగలిగే శాస్త్రీయ పరిజ్ఞానంగా ఎదగాలి. ఆ అవసరంలో నా వంతు ప్రయత్నంగా ఈ గ్రంథాన్ని రచించాను.కథన సిద్ధాంతాలను కేవలం సిద్ధాంతాలుగా కాకుండా, సుకుమార్ గారి స్క్రీన్‌ప్లే ప్రయోగాలను ఉదాహరణలుగా తీసుకుని వివరించే పద్ధతిని ఎంచుకున్నాను. సిద్ధాంతం, ఉదాహరణ, విశ్లేషణ, కథన సూత్రం-ఈ నాలుగింటినీ అనుసంధానించడమే ఈ గ్రంథం ఉద్దేశం.తెలుగు వ్యాకరణ సంప్రదాయంలోని 'ప్రయోగశరణా వైయాకరణాః' అనే భావన నాకు స్ఫూర్తి. ప్రయోగాల ఆధారంగా సూత్రాలను గుర్తించినట్లే, సుకుమార్ గారి సినిమాలను పరిశీలించి వాటిలోని ప్రత్యేకమైన, సాధారణంగా అన్వయించగల కథన పద్ధతులను గుర్తించే ప్రయత్నం చేశాను.పోతనామాత్యుడు చెప్పిన 'విన్నంత, కన్నంత, తెలియ వచ్చినంత తేటపరుతు' అనే మాటలే నా ప్రయత్నానికీ వర్తిస్తాయి. సుకుమార్ గారి కథన ప్రపంచాన్ని సంపూర్ణంగా నిర్వచించాననే ధీమా నాకు లేదు. నా అధ్యయనం, అనుభవం మేరకు నాకు కనిపించిన కథన ప్రయోగాలను మాత్రమే ఇక్కడ పరిచయం చేశాను.అందువల్ల ఈ గ్రంథాన్ని తుది నిర్ణయంగా కాకుండా, తెలుగు స్క్రీన్‌ప్లే అధ్యయనంలో ఒక తొలి అడుగుగా చూడాలని కోరుతున్నాను.నా ఆలోచనా ప్రయాణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా తోడైన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.ఈ గ్రంథం నా సంకల్పం.దాని వెనుక నిలిచిన ప్రతి మనిషికీ ఇది నా సమర్పణ.