Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
కథా ఖ్యాతి కిరీటానికి మరో మణిహారంలా మెరిసిన ఈ సృజనాత్మక యత్నానికి ప్రేరణనిచ్చిన రచయితలకూ, ఆ కథలను లోకవేదికపై నిలిపిన ’కస్తూరి విజయం’ సంస్థకూ హృదయపూర్వక అభినందనలు.పండుగల ఉత్సవ వైభవాన్ని, వాటి చుట్టూ అల్లుకున్న అనుభూతులను, చిత్రవిచిత్ర మానవ స్వభావాలను కథా రూపంలో మలచిన రచయితల సృజనాత్మకత అపూర్వం. ఈ పోటీలో దాదాపు 92 మంది రచయితలు తమ రచనలతో పాల్గొనగా, పది కి పైగా దేశాల నుంచి అంతర్జాలం ద్వారా వచ్చిన కథలు తెలుగు కథకు లభిస్తున్న అంతర్జాతీయ గౌరవానికి సాక్ష్యాలుగా నిలిచాయి.వచ్చిన ప్రతి కథను క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలోని సాహిత్య విలువలను వడపోసి, అత్యుత్తమమైన 22 విశిష్ట కథలను ఒక ప్రత్యేక ’కథా సంపుటి’గా మలచడం ఈ ప్రయత్నానికి మరింత గౌరవాన్ని చేకూర్చింది.ఈ బృహత్తర సాహిత్య కార్యంలో సంపాదకులుగా అంకితభావంతో వ్యవహరించిన శ్రీమతి పద్మజ పామిరెడ్డి గారికి, కథలను చదివి సంస్కరించడంలో, ప్రూఫ్ దిద్దడంలో కీలక పాత్ర పోషించిన వంగిపురపు హిమబిందు గారు, కొత్తపల్లి రవికుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అతి స్వల్ప కాలంలోనే ఇంతటి నాణ్యమైన సంకలనాన్ని సుసంపన్నంగా ఆవిష్కరించడం వారి శ్రమకు ప్రతిఫలం.తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తూ, సృజనాత్మకతకు వేదికగా నిలుస్తున్న ’కస్తూరి విజయం’ సంస్థకు, ఈ మహత్తర ప్రయాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాభినందనలు.