Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
కస్తూరి విజయం, వస్తు వైవిధ్యాన్ని సాహితీ ప్రేమికుల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటి వరకూ ఒకే అంశం పై కథలు, వ్యాసాలు, విమర్శ, బహుమతి పొందిన కథలు ప్రింట్ ఆన్ డిమాండ్ పద్దతిగా, అంతర్జాతీయంగా, తక్కువ ఖర్చుగా పాఠకులకు అందిస్తున్నాం. వాటి తరువాత తీసుకువస్తున్నదే ఈ ’ఆనందో బ్రహ్మ’ హాస్యకథల సంకలనం.హాస్య కథల ప్రచురణ , అంత సులభం కాదని,ఈ పని మొదలుపెట్టాక అర్ధమైంది. ఎందుకంటే, ఒక వైపు నవ్వించే కథకులకు ఎంతో కరువుంది. మరో వైపు హాస్య రచయితల ప్రోత్సాహానికి ఏ వేదిక సరిగ్గా లేదు. హాస్య రచయితలు పుట్టుకు రావాలంటే మనం వాళ్లను గౌరవించాలి.హాస్య రచయితలకు ఎంత కరువుందో! ఈ పద్యం చెబుతుంది.కరుణరసం కావాలా? గ్లాసులతో పోసుకోబీభత్సం కావాలా? బిందెలతో పోసుకోభయానకం కొరత లేదు- బ్రతుకంతా అదేగాహాస్యరసం కావాలా? చెంచాతో వేసుకో!హాస్య కథలు రాయడానికి చాలా వివేకం కావాలి. హాస్యం పండాలంటే, రచయితలోనూ చాతుర్యం ఉండాలి. హాస్యం రోగ నిరోధక శక్తినిస్తుంది. ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించే 17 కథల్ని ఏరి మీ ముందుకు తెస్తున్నాం. ఇందులో పగలబడి నవ్వించేవి, చిరునవ్వులు తెప్పించేవి ఎన్నున్నాయో పాఠకులే తేల్చాలి.’ఆనందో బ్రహ్మ’ కి హాస్య కథలు పంపిన రచయితలందరికీ, ఎన్నికైన మీ సృజనాత్మక కథల హాస్య భావానికి మా హృదయపూర్వక అభినందనలు...కస్తూరి విజయం.