Librería Desdémona
Librería Samer Atenea
Librería Aciertas (Toledo)
Kálamo Books
Librería Perelló (Valencia)
Librería Elías (Asturias)
Donde los libros
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
శాస్త్ర పరిశోధనల ఫలితంగా మానవుడు సరోగసి ద్వారా బిడ్డను కనడం వారి పరంపరను కొనసాగిస్తుంది. ఇలాంటి ఇతివృత్తం తన రచనా అంశంగా ఎన్నుకొని, గర్భాశయాని కి 'అమృత కలశం' సరికొత్తగా అన్వయించి సరోగసి ద్వారా బిడ్డను పొందడంలో అనేక సామాజిక అంశాలు ముడిబడి కొందరి చేతుల్లో వ్యాపార వస్తువుగా మారిందనే ఇతివృత్తాన్ని రచయిత సహజ సిద్ధమైన రీతిలో కళ్ళకు కట్టినట్లు ఆవిష్కరించారు. చదవడం మొదలు పెడితే పాత్రలు మనలను చుట్టుముట్టి అనేక సామాజిక అంశాలను ప్రశ్నిస్తాయి. శాస్త్రీయత, సామాజిక అంశాలతో ముడిబడి ఉన్న సున్నితమైన విషయం స్వార్ధ ఆర్ధిక ప్రయోజనాలకై సమాజాన్ని పీడిస్తున్న తీరు పై ప్రశ్నలు సంధించారు రచయిత. ఇలాంటి ఇతివృత్తాన్ని బహిరంగంగా చర్చకు దారితీసి సామాజిక ప్రయోజనాన్ని ఆశించడం రచయిత సాహసమనే చెప్పాలి. నేటి సమాజం లో వాస్తవికత, శాస్త్రీయపరమైన ఆలోచనలు కొరవడడంతో వైద్య వ్యాపార సాలెగూడులో చిక్కుకొని ఆర్ధికంగా మానసికంగా జరిగే నష్టం రచయిత చక్కగా తన రచనలో ఆవిష్కరించారు. వారు కోరుకున్న పనులు పూర్తయితే సంతోషంగా వుంటారు. విఫలమైనప్పుడు దురదృష్టం, పూర్వజన్మ సుకృతం, పాప ఫలితం లాంటి అభూత కల్పనల వైపు మనిషి ఆలోచనలు మారి వారికున్న సమస్యలను పరిష్కరించకోకబోగా మరింత జటిలం చేసుకుంటుంటారు. రచయిత ఎంచుకున్న కధాంశం లోని సజీవమైన పాత్రల ఆలోచనలు, వారికున్న ఆర్ధిక స్వార్ధం, బలహీనతలను సొమ్ము చేసుకోవడం, అవసరమనుకున్నప్పుడు మోసగించడం తదితర అంశాలను పరిశీలీస్తే చదువరులను సరైన దిశగా ఆలోచింపచేస్తాయి.డా. జి. సమరంనాస్తిక కేంద్రంవిజయవాడ