Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
తెల్లని రాత్రులు రష్యన్ రచయిత ఫ్యూడర్ దోస్తవస్కీ మహా నవలిక. ఏకాకి యువకుడు ఒకరు తన ఏకాకితనాన్ని గురించి ఆలోచిస్తూ సెయింట్ పీటర్స్ బర్గ్ వీధిన తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అతనికి కన్నీటితో ఉన్న ఒక యువతి ఎదురవుతుంది. ఆమెను ఇంటికిచేర్చే ప్రయత్నంలో ఇద్దరూ మాటలలోకి దిగి స్నేహితులవుతారు. రాత్రులు కలుసుకొని తమ కధలు ఒకరికొకరు చెప్పుకుంటారు. తిరిగి వచ్చి తనను పెళ్లిచేసుకుంటానని మాట ఇచ్చిన ప్రేమికుడు రాకపోయేసరికి తను దుఃఖిస్తున్నట్లు ఆ యువతి నస్తెంకా వివరిస్తుంది. ఆమె పట్ల తన అనుభూతులు దృఢమవుతున్నా కూడా, ఆ యువకుడు ఆమె ప్రేమికుడిని వెతికి పట్టుకోవటానికి సాయపడతానని మాట ఇస్తాడు.