Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
జపనీస్ నవలా ప్రపంచంలో 3 మిలియన్ కాపీలు అమ్ముడుపోయి, ఎందరో పాఠకులని అలరించిన పుస్తకం. యాసుకో ఓ సాధారణ మహిళ. ఆమెకి ఒక్కతే కూతురు. ప్రశాంతంగా సాగుతున్న ఆమె జీవితంలోకి, ఓ నాటి సాయంత్రం ఆమె మాజీభర్త చడి చప్పుడు లేకుండా ఊడిపడతాడు. దాంతో ప్రశాంతంగా వున్న జీవితం అల్లకల్లోలంగా మారుతుంది. టోక్యో పోలీస్ విభాగం నుంచి డిటెక్టివ్ కుసానగి, ఆనాడు రాత్రి జరిగిన ఘటనా క్రమాన్ని పరిశోధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను కనుక్కుంటాడు. ఎన్నో ఊహించని మలుపులు... ఏదీ అంతు చిక్కదు. జపాన్‌లో బెస్ట్ సెల్లింగ్ థ్రిల్లర్‌గా అమ్ముడయిన ఈ నవల ఓ హిట్ సినిమా ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ X తీయడానికి స్ఫూర్తి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని ఆస్వాదిస్తున్నారు. తిప్పిన పేజీ వెనక్కి తిప్పకుండా ఏకబిగిన చదివించే అద్భుత నవల. ఆహ్లాదకరమైన టోక్యో నగర వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు ఈ పుస్తకంలో. నవల ముగింపు అన్నింటికంటే అద్భుతంగా వుంటుంది - అనూహ్యమైన ముగింపు. అంతర్జాతీయ క్రైమ్ ఫిక్షన్ రచనలలో అగ్ర తాంబూలం అందుకున్న నవల.