K.V. Manpreetam / Sri Uha / Teja Gudikandula
Librería Samer Atenea
Kálamo Books
Librería Elías (Asturias)
Librería Kolima (Madrid)
Librería Proteo (Málaga)
పక్షులు ఎంతో కొంత అలానే వున్నా, పంజరం భిన్న వర్ణాలుగా మారింది. కొత్త వెతుకులాట నేర్పింది. ఈ నేర్పు సాధించలేనివాళ్ళ జీవన వేదన ఈ సంకలనంలో చాలా చోట్ల కనిపిస్తుంది. ఇందులోనూ మళ్ళీ స్థాయీ బేధాలున్నాయి. ప్రాంతీయత వైపు తెలుగు కథ సాగించిన ప్రయాణం మెట్రో వేగంతో మరో మలుపు తిరిగింది. ప్రాంతీయతకి బదులు కార్పొరేట్ కేంద్రంగా రూపు దిద్దుకుంటున్న కొత్త జీవన గతిని ఇక్కడ చూస్తాం.- అఫ్సర్అక్కడా ఇక్కడా అడపాదడపా వచ్చిన కార్పొరేట్ కథలు తప్పించి, ఒక వెల్లువగా ఈ అంశంపై కథలు వచ్చినవి లేవు. నాకు తెలిసి, నా తోటి రచయితల్లోనే కార్పరేట్లో ఉన్నవాళ్ళు ఎక్కువే! అయినా 'కథ' అనేసరికి ఉద్యోగ జీవితాల గురించి తక్కువగానే రాస్తున్నామని నా అభిప్రాయం. ఆ లోటును పూరించే ప్రయత్నమే ఈ 'లాగిన్ టేల్స్: కార్పరేట్ కథలు 2026' కథా సంకలనం. 18 మంది కథకులను ఒక్క తాటిపై తెచ్చి, కార్పరేట్ జీవితాల్లో ఉన్న వేర్వేరు కోణాలను ఈ కథల ద్వారా మనకి తెలిసేలా చేశారు.- పూర్ణిమ తమ్మిరెడ్డి